లాల్ బజార్ ఏరియాలో 30 కేజీల ప్లాస్టిక్ సీజ్
HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం అమలుపై విస్తృత తనిఖీలు చేపట్టారు. లాల్ బజార్ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో సుమారు 30 కేజీల నిషేధిత ప్లాస్టిక్‌ను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.