తవణంపల్లిలో పల్లెనిద్ర కార్యక్రమం ప్రారంభం
చిత్తూరు తవణంపల్లి మండలం పుణ్య సముద్రం గ్రామంలో ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తవణంపల్లి ఎస్సై చిరంజీవి ఈ సందర్భంగా పుణ్యసుందరి గ్రామ ప్రజలతో మమేకమై చట్టాలపై అవగాహన కల్పించారు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడకూడదని మైనర్ పిల్లలు వాహనాలు నడపరాదని అలా నడిపిన ఎడల చట్టరీత్యా నేరమని తెలిపారు.