అప్పు తీర్చమని అడిగినందుకు హత్య

KMR: దేవునిపల్లి PS పరిధి నర్సన్నపల్లిలో మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. SP రాజేశ్ చంద్ర వివరాలు.. బెయిల్ కోసం మృతురాలు కవిత వద్ద నిందితుడు మహేశ్ రూ. లక్ష అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వమని కవిత ఒత్తిడి చేయడంతో పథకం వేసి ఆమెను హత్య చేశాడు. నిందితున్ని అరెస్ట్ చేసి, దొంగలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు SP శుక్రవారం వెల్లడించారు.