ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
NLG: గుర్రంపోడు మండలం వట్టికోడు గ్రామంలో గురువారం రాత్రి విషాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి సంజీవ అనే వ్యక్తి మృతి చెందాడు. సంజీవ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పని నిమిత్తం రామన్నపేట నుంచి వెళ్తుండగా సిరిపురం సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంజీవ అక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.