'మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'
JGL: మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం కిష్టంపేటలో రూ.20 లక్షలతో రెండు, భూపతిపూర్లో రూ.20 లక్షలతో రెండు, వడ్డేలింగాపూర్‌లో రూ.10 లక్షలతో ఒకటి, వడ్డెర కాలనీలో రూ.10 లక్షలతో ఒకటి, చర్ల కొండాపూర్‌లో రూ.10 లక్షలతో ఒక మహిళా సంఘం భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.