నేడు పులివెందులలో పవర్ కట్
KDP: పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, ఇ. కొత్తపల్లె విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రమేశ్ తెలిపారు. ఈ మేరకు గ్రామాల్లో చెట్టు కొమ్మల తొలగింపు కారణంగా సరఫరా నిలిపివేస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు, రైతులు గమనించి, సహకరించాలని కోరారు.