'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి'

కృష్ణా: నేషనల్ లోక్ అదాలత్ జేఎఫ్సీఎం కోర్ట్ నందు ఈ నెల 13న జరుగుతుందని, రాజీపడదగిన కేసులు ఉంటే వచ్చి ఇరు వర్గాలు రాజీ పడగలరని గుడివాడ టూ టౌన్ పోలీసు స్టేషన్ సీఐ హానీష్ తెలిపారు. శుక్రవారం స్టేషన్‌లో మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని గుడివాడ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.