'మట్టి విగ్రహాలనే పూజించాలి'

VZM: వినాయక చవితికి మరో 10 రోజులే ఉంది. కమిటీ కుర్రోళ్లు ఆ ఏర్పాట్లలో బిజీ అయిపోయారు. అయితే కాలుష్య నియంత్రణకు మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని కుమ్మరి వృత్తిదారులు కోరుతున్నారు. పీఓపీ విగ్రహాల వలన జల, వాయు కాలుష్యం అవుతుందన్నారు. మట్టినే నమ్ముకుని దేవతా మూర్తుల విగ్రహాలను అందంగా చేస్తున్న బొబ్బిలి(M) పెంట గ్రామానికి చెందిన ప్రజలు తెలిపారు.