'పండగ తర్వాత రోడ్లను అద్దంగా తయారు చేస్తాం'

SRD: వినాయక చవితి తరువాత అన్ని శాఖల అధికారులతో మాట్లాడి నిధులు తెప్పించి అశోక్ నగర్ ప్రాంతంలోని రోడ్లను అద్దంలా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ యాదవ్ తెలిపారు. శుక్రవారం అశోక్ నగర్ ప్రాంతాలను కాలనీవాసులతో కార్పొరేటర్ తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల వల్ల రోడ్లు చెడిపోయాయని పేర్కొన్నారు.