ప్రతి ఓటుకు గౌరవం తీసుకొస్తా: డిప్యూటీ సీఎం
KMM: మధిర నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ముదిగొండ మండలం గంధసిరిలో ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 'మధిర ప్రజలు వేసిన ప్రతి ఓటుకు గౌరవం తీసుకొస్తా' అని భట్టి హామీ ఇచ్చారు.