అంగన్వాడీ కేంద్రం పరిశుభ్రతపై కలెక్టర్ అసంతృప్తి
NRPT: గుండుమాల్ అంగన్వాడీ-1 కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. కేంద్రంలో పరిశుభ్రత లేకపోవడం, తగినంత వెలుతురు లేని విషయంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారులు ఉండే ప్రదేశాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇకపై కేంద్రాలను సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.