VIDEO: బ్యాంగిల్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం
కర్నూలు నగరంలో గురువారం ఒక బ్యాంగిల్స్ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. పండుగ సందర్భంగా దుకాణం మూసి ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.40 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపాడు.