కుక్కల నియంత్రణ ఆపరేషన్ సెంటర్ ప్రారంభం

సత్యసాయి: ధర్మవరం పట్టణంలో కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సెంటర్‌ను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. సెంటర్‌లో శస్త్రచికిత్సలు, వ్యాక్సినేషన్ విధానాలను పరిశీలించారు. వెటర్నరీ వైద్యులు, సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో వీధి కుక్కల నియంత్రణతో పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ఈ సెంటర్ దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.