చిన్నపసువులలో కార్డాన్ సెర్చ్ నిర్వహణ
KDP: సరైన పత్రాలు లేని 6 మోటర్ సైకిల్స్ సీజ్ చేశామని JMD రూరల్ సీఐ భాస్కర్ రెడ్డి తెలిపారు. బుధవారం చిన్నపసువులలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను కలిగి ఉండాలని సీఐ సూచించారు.