పేదలకు భరోసా ఇవ్వడం సంతోషంగా ఉంది: ఎమ్మెల్యే

ATP: శింగనమల నియోజకవర్గ పరిధిలోని పేదలకు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. తన క్యాంపు కార్యాలయంలో రూ. 38,72,876ల విలువైన చెక్కులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధితో పేదలకు భరోసా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పారు.