VIDEO: హార్సిలీ హిల్స్‌లో పర్యాటకులకు నిరాశ
అన్నమయ్య: జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, వేసవి విడిది ప్రదేశమైన హార్సిలీ హిల్స్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతోంది. చెత్తాచెదారం, పగిలిన గాజు సీసాలు, మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. ప్రైవేటు అతిథి గృహాల నుంచి వచ్చే మరుగునీరు నియంత్రణ లేకుండా బయటకు వచ్చి నీటి కొలనులా నిలిచి దుర్వాసన వెదజల్లుతోందని పర్యాటకులు తెలిపారు.