విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ
ADB: బేల మండలం గూడ గ్రామంలోని MPPS పాఠశాల, అంగన్వాడి కేంద్రంలో సర్పంచ్ గోడే అవినాష్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అంగన్వాడీ చిన్నారులకు అక్షరమాల పుస్తకాలు అందజేశారు. విద్యార్థుల అభివృద్ధికి విద్య ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహం కలుగుతుందని తెలిపారు.