‘18 ఏళ్ల నిరీక్షణకు తెరదించవచ్చు’

RCB జట్టు తమ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించవచ్చని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తొలి IPL సీజన్ నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ గెలవని RCB, ఈసారి ప్లేఆఫ్స్ రేసులో దూసుకుపోతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మంచి స్థానంలో ఉన్న RCB ప్రదర్శనపై గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. MI కూడా ప్లేఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ, ఈసారి కష్టమేనని చెప్పాడు.