సంక్షేమ హాస్టళ్లను గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారు
BHNG: కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లను గాలికొదిలేసింది. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను పట్టించుకోవడం మానేసింది. కనీసం పిల్లలకు ఖర్చు పెట్టే మెస్సు బిల్లులు కూడా విడుదల చేయడం లేదు. బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒక్కోశాఖలో లక్షల కొద్దీ నిధులు పేరుకుపోయాయి. దీంతో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందని ద్రాక్షగానే మారుతోంది.