VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కృష్ణా: మచిలీపట్నం—విజయవాడ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతుదేహాలను ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.