మురుగు చెత్తతో ప్రజలకు ఇబ్బందులు

NLG : నల్గొండలోని DVK రోడ్డులో ఉన్న గాంధీ న్యూరో ఆసుపత్రి, JSR గ్రాండ్ ఇతర వాణిజ్య సముదాయాల పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పేరుకుపోయిన మురుగు, చెత్తాచెదారం కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో వెళ్లే బాటసారులు, కాలనీవాసులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు.