తహసీల్దార్ల బదిలీలు.. కలెక్టర్ ఉత్తర్వులు
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు తమకు కేటాయించిన స్థానాల్లో తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు. విధుల్లో చేరిన వెంటనే చేరిక నివేదికలు సమర్పించాలని , పనులు అంతరాయం లేకుండా కొనసాగేందుకు ఆలస్యం చేయవద్దని కలెక్టర్ పేర్కొన్నారు.