VIDEO: వాహన తనిఖీల్లో వాగ్వివాదం
GNTR: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వాహనాల తనికల్లో భాగంగా గుంటూరు పట్టాపురం వద్ద వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనికల్లో ఓ యువకుడు తన ద్విచక్ర వాహనానికి మోడిఫైడ్ సైలెన్సర్‌ను ఉంచడంతో పోలీసులు వాహనాన్ని నిలిపి పరిశీలించారు. వాహన చోదకుడు "మీరు నా బండిని ఎలా ఆపుతారు?" అని పోలీసులతో వాగ్వివాదనికి దిగాడు.