కాలం చెల్లిన కళ్యాణ లక్ష్మి చెక్కులు.. అధికారుల నిర్లక్ష్యం
ADB: బజార్‌హత్నూర్ మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో నిర్లక్ష్యం చోటుచేసుకుంది. మార్చి 7న బోథ్ MLA చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కాగా, లబ్దిదారులు ఆ చెక్కులను బ్యాంకుల్లో జమ చేయడానికి వెళ్లగా చెక్కులు కాలం చెల్లినవని, ఇవి పనిచేయవంటూ బ్యాంకు అధికారులు తిరస్కరించారు. దీంతో చేసేదేమి లేక తిరిగి రెవెన్యూ అధికారులు ఆ చెక్కులను రిటర్న్ తీసుకున్నారు.