మార్కెట్ కమిటీ చైర్మన్‌ను పరామర్శించిన పోచారం

NZB: జిల్లా వర్ని మండల మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబాను ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో సురేష్ బాబా గాయపడగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.