మార్వాడీ దుకాణంలో నిషేధిత సిగరెట్లు

మార్వాడీ దుకాణంలో నిషేధిత సిగరెట్లు

BHNG: మోత్కూరులోని మహదేవ్ మార్వాడీ దుకాణంపై శనివారం ఎస్‌వోటీ అధికారులు ఆకస్మిక దాడి చేశారు. దుకాణంలో అనుమతి లేకుండా విక్రయిస్తున్న సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్థానిక పోలీసులకు అప్పగించారు. దుకాణ యజమానిపై కేసు నమోదు చేసినట్లు రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎవరైనా అనుమతి లేని వస్తువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.