'ఆదివాసీ హక్కుల పరిరక్షణకు కృషి చేద్దాం'

ASF: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ.. ఆదివాసీల సాంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకునేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని, ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.