రైల్వే ప్రయాణికులకు శుభవార్త
HYD: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ స్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రతి సంవత్సరం పండుగలకు ప్రజలు తమ సొంత ఊర్లకు వెళ్లడానికి రైళ్లను ఎక్కువగా ఆశ్రయిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా రైల్వే అధికారులు ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించారు.