పెదకాకాని ఎంపీపీపై నేడు అవిశ్వాస తీర్మానం
GNTR: పెదకాకానిలో ప్రస్తుతం వైసీపీకి చెందిన తుల్లిమిల్లి శ్రీనివాసరావు ఎంపీపీగా భాద్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ మేరకు వైసీపీ చెందిన ఏడుగురు, టీడీపీ చెందిన ఆరుగురు ఎంపీటీసీలు సంతకాలు చేసి ఆయనపై అవిశ్వాస ప్రకటించారు. దీంతో రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆర్డీవో కె. శ్రీనివాసులు ఇవాళ ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసే అత్యవసర సమావేశంలో ఎంపీపీ బలం నిరూపించుకోవాల్సి ఉంది.