నేడు విశాఖకు డిప్యూటీ సీఎం రాక
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించనున్న 'ఇంటర్నేషనల్ కల్చరల్ ఫెస్ట్'కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బుధవారం సాయంత్రం 5:30 గంటలకు ఏయూ చేరుకొని రాత్రి 8 గంటల వరకు వేడుకల్లో పాల్గొంటారు. పవన్ కల్యాణ్ పర్యటన నిమిత్తం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.