టెక్కలిలో పూర్వవిద్యార్థులు కలయిక

టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009-10 సం.లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమం ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగింది. పూర్వ విద్యార్థులంతా ఒక చోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా అలనాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.