VIDEO: అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం: ఎమ్మెల్యే

WGL: గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ నాయకులు వరంగల్ నగరానికి ఏం అభివృద్ధి చేశారో... చెప్పాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరంగల్ నగరానికి అనేక నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.