VIDEO: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం: ఎమ్మెల్యే
KDP: ప్రజల అవసరాల మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, భవనాలు, మరమ్మతులను గుర్తించి వాటిని త్వరగా పూర్తి చేస్తామన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలను ఎలా కల్పించాలో గుర్తించి, వారికి తగిన ఉద్యోగాలు అందించడానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు.