వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి: సర్పంచ్ కావేరి
ADB: చిన్నారులు, గర్భిణీ స్త్రీలకు వ్యాధి నిరోధక టీకాలను తప్పకుండ వేయించాలని సర్పంచ్ బానోత్ కావేరి అన్నారు. బుధవారం నార్నూర్ మండల కేంద్రంలోని ఆరోగ్య సబ్ సెంటర్‌ను సందర్శించారు. చిన్నారులకు జననం నుండి ప్రభుత్వం అందించే టీకాల ద్వారా ఆరోగ్య భద్రత లభిస్తుందని తెలిపారు. టీకాలు ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు.