నేడు భద్రాచలంలో గోటి తలంబ్రాలు అందజేత

SDPT: నేడు భద్రాచలంలో గోటి తలంబ్రాలు అందజేయనున్న రామకోటి రామరాజు భద్రాచల సీతారాముల కళ్యాణనికి గత 45 రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది భక్తులు రామనామ స్మరణ చేస్తూ గోటితో 250కిలోల వడ్లను ఓలిచారు. వీటిని ఈ రోజు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు,భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భద్రాచలంలో అందజేయనున్నారు.