నూజివీడులో నేడు మీకోసం రద్దు: సబ్ కలెక్టర్

నూజివీడులో నేడు మీకోసం రద్దు: సబ్ కలెక్టర్

ఏలూరు: నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించవలసిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అమర జీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల సందర్భంగా రద్దు చేయడం జరిగిందని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశంతో రద్దు చేయడం జరిగిందని, రానున్న సోమవారం యధావిధిగా కొనసాగుతుందన్నారు.