జోగుళాంబ అమ్మవారిని దర్శించుకున్న సినీ నటి
GDWL: అలంపూర్ పుణ్య క్షేత్రంలోని జోగుళాంబ అమ్మవారిని సినీ నటి కరాటే కళ్యాణి ఇశాళ దర్శించుకున్నారు. ఆమె విద్య కోటి కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు జిల్లా ధర్మ ప్రచార పరిషత్ బాధ్యులు నర్సింహులు, వారణాసి శివానంద స్వామి, కొత్తకోట భీమా రాధిక, భీమా జ్యోతి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.