సైలాడలో పశు ఆరోగ్య శిబిరం

సైలాడలో పశు ఆరోగ్య శిబిరం

SKLM: నందిగాం మండలం సైలాడ గ్రామంలో సోమవారం అసిస్టెంట్ డైరెక్టర్ ఎం రవికృష్ణ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 20 పశువులకు గర్భకోశ చికిత్సలు, 3 పశువులకు పొదుగు వాపు, 40 పశువులకు ఏలిక పాము నివారణ మందులు వేశారు. పశువులలో పాల ఉత్పత్తికి పశుగ్రాసం సాగు, టీఎంఆర్ దాణా ప్రాముఖ్యతను పశువైద్య సిబ్బంది వివరించారు.