VIDEO: వేములపల్లిలో ఘనంగా దసరా వేడుకలు
MHBD: దంతాలపల్లి మండలం వేములపల్లిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో యువతీ, యువకులు ఆటపాటలతో, డీజే డాన్స్‌లతో గ్రామమంతా మార్మోగింది. ఈ సందర్భంగా గడి మైసమ్మకు నమస్కరించి, కత్తికి కంకణం కట్టి పూజించారు. అనంతరం సోరకాయను ఆ తర్వాత యాటను వధించి..జమ్మి కోసం పరుగులు తీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.