రోడ్డు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం!
MBNR: ధర్మపూర్ సమీపంలోని JPNCE కాలేజీ వద్ద మున్సిపల్ చెత్త వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరు ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.