రైలు కింద పడి వృద్ధురాలు మృతి
KDP: కమలాపురం-ఎరుగుడిపాడు మధ్య సోమవారం విషాదం చోటుచేసుకుంది. లింగమ్మ(86) అనే వృద్ధురాలు రైలు కిందపడి మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. కమలాపురం(M) గొల్లపల్లికి చెందిన లింగమ్మ పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.