చనిపోయిన ఓ వ్యక్తి ఖాతా నుంచి డబ్బులు మాయం

చనిపోయిన ఓ వ్యక్తి ఖాతా నుంచి డబ్బులు మాయం

KMM: చనిపోయిన ఓ వ్యక్తి ఖాతా నుంచి ఫోన్‌పే ద్వారా నగదు కాజేసిన ఘటన సత్తుపల్లిలో చోటుచేసుకుంది. హనుమాన్ నగర్‌కు చెందిన ఆలేటి ప్రసాద్ 3 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు బ్యాంకుకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేయగా, అతని ఫోన్ పే ద్వారా  రూ. 3 లక్షలు మాయమైనట్లు తెలిసింది. దీంతో కుంటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.