నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన వాకర్స్ అసోసియేషన్

హనుమకొండ: కాజీపేట మండల కేంద్రంలో నేడు వడ్డేపల్లి వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రహదారులపై నిద్రించే పలువురికి దుప్పట్లను పంపిణీ చేశారు. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బొల్లెపల్లి రాజేష్, ఆరేపల్లి శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో 120 మందికి దుప్పట్లను అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు భాగస్వామ్యం పంచుకున్నారు.