కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య

కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య

KMM: కుటుంబ కలహాల కారణంగా ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం కూసుమంచి మండలం నర్సింహులగూడెంలో చోటు చేసుకుంది. నర్సింహులగూడెంకు చెందిన కొక్కిరేణి ఎర్రయ్య తన ఇంట్లోనే ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న కూసుమంచి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.