దోమల నివారణకు ముమ్మరంగా ఫాగింగ్
MBNR: రాజాపూర్ మండల కేంద్రంలో ప్రజలు రోగాల బారిన పడకుండా సర్పంచ్ కావలి రామకృష్ణ, కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఫాగింగ్ నిర్వహించారు. గ్రామంలో దోమలు, ఈగలు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా అన్ని వార్డుల్లో ఈ చర్యలు చేపట్టారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు సూచించారు.