నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

PPM: మన్యం జిల్లాలో పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా చేపడుతున్న డోలీ రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను హెచ్చరించారు. పనుల్లో పురోగతి లేకుండా పొంతన లేని వివరాలు తెలియజేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. పనుల్లో నిర్లక్ష్యం లేకుండా, నిర్మాణాల్లో పొరపాట్లకు తావు లేకుండా పని చెయ్యాలన్నారు.