VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రంలో తనిఖీలు
కోనసీమ: ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ అన్నారు. మోడేకుర్రు, నర్సిపూడి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సత్య కృష్ణ రైస్ మిల్లును తనిఖీ చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని సూచించారు.