పీజీఆర్ఎస్‌కు 93 దరఖాస్తులు
SKLM: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు జిల్లా నలుమూలల నుంచి 93 దరఖాస్తులు వచ్చాయని సంబంధిత అధికారులు తెలిపారు. అర్జీదారులు సమర్పించిన వాటిపై అలసత్వం వహించకుండా సమగ్రంగా దర్యాప్తు జరిపి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, వైద్యశాఖ తదితర శాఖలకు సంబంధించి దరఖాస్తులు సమర్పించారు.