రోడ్డు సమస్యను పరిష్కరించాలని వినతి

రోడ్డు సమస్యను పరిష్కరించాలని వినతి

NLR: బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని 17 వార్డు కాశీ పాళెం మహాలక్ష్మి గుడి వెనకాల రోడ్డు గుంతల మయమైందని స్థానికులు తెలిపారు. రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఎన్టీపీఐ నియోజవర్గ అధ్యక్షుడు మహబూబ్ బాషా సోమవారం నగర కమిషనర్ బాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. రోడ్డు గుంతలుగా ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.