రేపు వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత కార్యక్రమం

రేపు వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత కార్యక్రమం

CTR: స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15న వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత అంశంపై కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ గురువారం తెలిపారు. శుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మూత్ర విసర్జనకు బహిరంగ ప్రదేశాల వినియోగాన్ని నివారించడంపై వివిధ శాఖల అధికారులు క్షేతస్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన కోరారు.